For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: కేఎల్ రాహుల్

KL Rahul regrets bowling errors as RCB snatch victory despite horror start

ముంబై: బౌలింగ్, బ్యాటింగ్‌లో చేసిన కొన్ని తప్పిదాలు తమ ఓటమికి కారణమయ్యాయని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో.. 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్.. బౌలింగ్‌లో 15-20 పరుగులు ఎక్కువగా ఇవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో మిడిలార్డర్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. అయితే తమ జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నా.. ప్రత్యర్థి జట్లలోని ఒకరిద్దరూ ఆటగాళ్లు చెలరేగుతుండటం ఓటమికి కారణం అవుతుందన్నాడు.

శుభారంభం అందుకున్నా..

'తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి మంచి ఆరంభాన్ని అందుకున్నాం. అంత మంచి ఆరంభాన్ని అందుకొని కూడా పవర్ ప్లేలో 50 పరుగులు సమర్పించుకున్నాం. మేం మరింత కట్టడిగా బౌలింగ్ చేయాల్సింది. ఈ వికెట్‌పై 180 ప్లస్ టార్గెట్ చాలా ఎక్కువ. 15-20 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం. మిడిలార్డర్‌లో బ్యాట్‌తో రాణించలేకపోయాం. ఒక టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఆడితే ఇతర బ్యాటర్లు అతనికి అండగా నిలిచేవారు. కానీ అలా చేయలేకపోయాం.

శుభారంభం అందుకున్నా..

మాది అద్భుతమైన జట్టు. మా ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నా. అయితే కొన్ని మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణించాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో కూడా శుభారంభం అందుకున్న మేం ఆ జోరును ఆఖరి వరకు కొనసాగించలేక మూల్యం చెల్లించుకున్నాం. ప్రతీ ఒక్కరూ ఫామ్‌లో ఉండటంతో పాటు పరుగులు చేస్తున్నారు. ఒకరిద్దరూ ఆటగాళ్లు తమదైన రోజున చెలరేగుతూ.. మా విజయవకాశాలను లాగేసుకుంటున్నారు'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

సూపర్ విక్టరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. లక్నో బౌలర్లలో దుష్మంత్ చమీరా, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

కేఎల్ రాహుల్(24 బంతుల్లో 3 ఫోర్లతో సిక్స్‌తో 30), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) మినహా అంతా విఫలమయ్యారు. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ వైఫల్యం జట్టు పతనాన్ని శాసించింది. 36 పరుగుల్లో 72 పరుగులు అవసరమైనప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోయినీస్.. నిదానంగా ఆడాడు. 12 బంతుల్లో 34 పరుగులు అవసరమైన సమయంలో హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Story first published: Wednesday, April 20, 2022, 7:18 [IST]
Other articles published on Apr 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+