Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాది ఏం ఉందన్నా! మాట సాయమే.. అంతా కుల్దీప్‌ దయ: కేఎల్ రాహుల్

కొలంబో: శ్రీలంక బ్యాటర్ సమర విక్రమార్క‌ వికెట్ క్రెడిట్ తనది కాదని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది.

అయితే ఈ మ్యాచ్‌లో సమర విక్రమార్క్ వికెట్ కోసం కేఎల్ రాహుల్.. కుల్దీప్ యాదవ్‌తో కలిసి మాస్టర్ ప్లాన్ రచించాడు. వికెట్ల వెనుకా మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్ల కదిలకలను పసిగట్టి బౌలర్లకు పలు సూచనలు చేశాడు. సమర విక్రమార్కకు నాలుగు లేదా ఐదో స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేయాలని, బంతి ఇంకా డ్రిప్ అవుతుందని కుల్దీప్ యాదవ్‌కు సూచించాడు. రాహుల్ చెప్పినట్లుగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా.. మూడో బంతికి సమర విక్రమార్క స్టంపౌటయ్యాడు.

KL Rahul Refuses Credit For Kuldeep Yadav’s Wicket

మ్యాచ్ అనంతరం ఈ వికెట్ గురించి కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ వికెట్‌ క్రెడిట్ తనది ఏ మాత్రం కాదని, మాట సాయం మాత్రమేనని స్పష్టం చేశాడు. 'ఆ వికెట్‌కు సంబంధించిన క్రెడిట్ ఏ మాత్రం నాది కాదు. నేను తీసుకోను కూడా. కుల్దీప్ యాదవ్ నైపుణ్యం అది.
అతను ప్లాన్‌ను పకడ్బందీగా అమలు పరచడంతోనే వికెట్ దక్కింది. వికెట్ల వెనుకాల వికెట్ కీపర్‌గా బ్యాటర్ కదిలికలను పసిగట్టవచ్చు. నేను సమర విక్రమార్క ఫుట్‌వర్క్‌ మేసేజ్‌ను కుల్దీప్ యాదవ్‌కు చెప్పాను. లక్కీగా నేను చెప్పిన చిట్కా పని చేసింది.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో గెలవడం అద్భుతమని రాహుల్ తెలిపాడు. 20-30 పరుగులు తక్కువగా చేసినా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించామని చెప్పాడు. 'ఇదో అద్భుత విజయం. మ్యాచ్ అసాంతం మా సత్తాకు పరీక్షగా నిలిచింది. మేం 100 ఓవర్లపాటు మైదానంలో లేకపోయినా.. ఆడినన్న ఓవర్లు భౌతికంగా పరీక్ష పెట్టాయి. మేం పుంజుకొని విజయం సాధించడం మాత్రం అద్భుతం.

జట్టుగా సమష్టిగా రాణించి అసాధారణ విజయాన్నందుకున్నాం. జట్టు విజయానికి నా వంతు తోడ్పాటు అందించడం ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. గత 4-5 నెలలుగా నేను ఆటకు దూరంగా ఉన్నాను. ఎలాంటి అవకాశాన్ని అయినా తీసుకుంటాను.

ఇషాన్ కిషన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాను. ఒక వేదికపై వరుసగా మూడు రోజులు ఆడటంతో పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారింది. అయినా మేం అద్భుతంగా ఎదుర్కొన్నాం. మేం 20-30 పరుగులు తక్కువగానే చేశాం. మరికొన్ని భాగస్వామ్యాలు లభిస్తే 230-240 పరుగులు చేసేవాళ్లం.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, September 13, 2023, 11:59 [IST]
Other articles published on Sep 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+