Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia, 1st T20: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. 5 వికెట్లు కోల్పోయిన భారత్

KL Rahul out for 51 as India stutter in Canberra

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టీమిండియా 100 పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ మినహా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. రాహుల్ ఒక్కడే తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. అబాట్ వేసిన 11వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో క్విక్ సింగిల్ తీసి 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్క్ బౌలింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. స్వెప్సన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ స్థితిలో సంజూ శాంసన్‌తో రాహుల్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించింది. కానీ హెన్రీక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శాంసన్(23) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మనీష్ పాండే(1), రాహుల్(51) కూడా ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, December 4, 2020, 15:20 [IST]
Other articles published on Dec 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+