India tour of Zimbabwe: రోహిత్‌కు రెస్ట్.. కోహ్లీకి టెస్ట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా తీరిక లేని క్రికెట్ ఆడనుంది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆటగాళ్ల వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంగ్లండ్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా అక్కడి నుంచి వెస్టిండీస్ పర్యటనకు బయలు దేరింది. అక్కడ మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే వన్డే సిరీస్ నుంచి సీనియర్ ఆటగాళ్లందరికి రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ధావన్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. మళ్లీ టీ20 సిరీస్‌కు మాత్రం ఒకరిద్దరూ మినహా సీనియర్లందరినీ జట్టులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కరేబియన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టగా శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.

వెంటనే జింబాబ్వే టూర్..
జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో జింబాబ్వే టూర్‌కు కూడా బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపించనుంది. ఆసియా కప్ దృష్ట్యా ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..
ఈ క్రమంలో జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ అయిన రాహుల్ హెర్నీయా సర్జరీ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. విండీస్ టీ20 సిరీస్‌కు ముందు రాహుల్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌లో పాసైతేనే రాహుల్ విండీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఒకవేళ విఫలమైనా.. జింబాబ్వే పర్యటనలోపు అతను ఫిట్ కానున్నాడు.

ఫామ్ తెచ్చిన తంటాలు..
పేలవ ఫామ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. కోహ్లీని ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో విరాట్‌ను ఆడిస్తే అతను గాడిన పడుతాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తీసుకున్న బ్రేక్‌తో అతనికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నా. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఈ బ్రేక్ ఉపయోగపడుతుందనుకుంటున్నా. అయితే ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా పెద్ద టోర్నీలు ఆడటం కష్టం అవుతుంది. అందుకే మేం అతన్ని జింబాబ్వే పర్యటనకు పంపించాలనుకుంటున్నాం.
అది అతనికి అనుగైన ఫార్మాట్. ఆసియా కప్ ముందు మళ్లీ ఫామ్ అందుకనేందుకు కోహ్లీకి జింబాబ్వే పర్యటన ఉపయోగపడుతుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం.'అని సదరు సెలెక్షన్ కమిటీ మెంబర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications