న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ వార్నర్‌ గాయం ఎక్కువ రోజులుంటే బాగుండు: కేఎల్ రాహుల్

KL Rahul jokes about David Warners injury, It will be nice if he gets injured for a long time

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అయిన గాయం పెద్దదైతే బాగుండని టీమిండియా వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్ కేఎల్‌ రాహుల్‌ సరదాగా అన్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీసేన బ్యాటింగ్‌ చేస్తుండగా వార్నర్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం స్పందించిన రాహుల్‌.. అతనికైన గాయం ఎక్కువ రోజులుంటే బాగుండని సరదాగా చెప్పుకొచ్చాడు.

అలా జరగాలని తాను ఏ క్రికెటర్‌ విషయంలో కోరుకోనని చెబుతూనే.. వార్నర్ ఆసీస్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌ అయినందున ఇలా సరదాగా అంటున్నానని స్పష్టం చేశాడు. ఒకవేళ అదే జరిగితే భారత్‌కు కలిసి వస్తుందన్నాడు. మరోవైపు వరుసగా రెండు వన్డేల్లో ఓడినా తమ జట్టు ఇంకా సానుకూలంగా ఉందని స్పష్టం చేశాడు.

పాజిటీవ్‌గానే ఉన్నాం..

పాజిటీవ్‌గానే ఉన్నాం..

‘వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ చేజారినా.. మా ఆలోచనా విధానం ఇంకా పాజిటీవ్‌గానే ఉంది. ప్రత్యర్థి జట్టు మాకంటే బాగా ఆడిందనే విషయాన్ని కొన్నిసార్లు అంగీకరించాలి. వారికిది స్వదేశీ సిరీస్‌ కావడంతో బాగా ఆడారు. వన్డే సిరీస్ కోల్పోయినా ఇది లాంగ్ టూర్ కావడంతో ఇంకా ఆడాల్సింది చాలా ఉంది. ఇలాంటి బ్యాటింగ్‌ వికెట్లపై సరైన బౌలింగ్‌ చేయడమే మేమిప్పుడు చేయాల్సి ఉంది. అదే పెద్ద సవాలు. అందుకోసం మా బౌలర్లు కష్టపడుతున్నారు. అయితే, మా ఆటగాళ్లు కొన్ని తప్పులు చేశారు. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది' అని టీమిండియా బ్యాట్స్‌మన్‌ వివరించాడు.

బుమ్రా చెలరేగుతాడు..

బుమ్రా చెలరేగుతాడు..

అనంతరం బుమ్రా బౌలింగ్‌పై స్పందిస్తూ.. అతను ఎలాంటి బౌలరో అందరికీ తెలుసని, కచ్చితంగా వికెట్లు తీసి మళ్లీ ఆకట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా లాంటి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, అక్కడ మేటి బౌలర్లు సైతం వికెట్లు తీయలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పాడు. ఇక తన బ్యాటింగ్‌ విషయంలో డాట్‌బాల్స్‌ ఆడటం తక్కువ చేసుకోవాలనుకుంటున్నట్లు రాహుల్‌ పేర్కొన్నాడు.

చెత్త పెర్ఫామెన్స్..

చెత్త పెర్ఫామెన్స్..

ఎన్నో అంచనాల మధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు పేలవ ఆటతీరుతో వరుసగా ఓటమిలైంది. ఫస్ట్ వన్డేలో 66, రెండో వన్డేలో 51 పరుగులతో చిత్తయింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నామమాత్రపు మూడో వన్డే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఈ రెండు వన్డేల్లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పోటీపడి మరీ పరుగులు సమర్పించుకున్నారు.

Story first published: Monday, November 30, 2020, 13:27 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X