For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KL Rahul జిడ్డు బ్యాటింగ్ వల్లే లక్నో ఓటమి.. పటీదార్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఫ్యాన్స్ ఫైర్!

KL Rahul Innings Is Main Reason For Lucknow Loss Fans Fire On LSG Captain

హైదరాబాద్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే లక్నో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి నిష్క్రమించిందని మండిపడుతున్నారు. బుధవారం ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 పరుగులతో లక్నోను ఓడించిన విషయం తెలిసిందే. దాంతో రాహుల్ సేన ఇంటిదారి పట్టగా.. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ఆర్‌సీబీ సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో రాణించినా లాభం లేకపోయింది. కీలక సమయంలో వినూత్న షాట్ ఆడే క్రమంలో రాహుల్ ఔటవ్వడంతో మ్యాచ్ ఆర్‌సీబీ వశమైంది.

వ్యక్తిగత ఇమేజ్ కోసమే...

గతంలో మాదిరి ఈ మ్యాచ్‌లో కూడా రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో వన్డే తరహా బ్యాటింగ్ చేయడంతో లక్నో విజయాన్నందుకోలేకపోయిందంటున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై సెటిల్ అయిన బ్యాటర్ ఈజీగా రన్స్ చేస్తారని, కానీ రాహుల్ ఆ దిశగా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. జట్టు కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆడాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 58 బంతులు ఆడి 79 పరుగులే చేయడం పెద్ద నేరమంటున్నారు. గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున కూడా రాహుల్ ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడి గెలిచే మ్యాచ్‌లను చేజార్చాడని గుర్తు చేస్తున్నారు.

పటీదార్‌ను చూసి నేర్చుకో..

ఆర్‌సీబీ యువ కెరటం రజత్ పటీదార్‌ను చూసి నేర్చుకోవాలని కేఎల్ రాహుల్‌కు సూచిస్తున్నారు. పటీదార్ 49 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడని, 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 పరుగులతో అజేయంగా నిలిచాడని కామెంట్ చేస్తున్నారు. అతని కంటే 5 బంతులు ఎక్కువే ఆడి విజయాన్ని అందించలేకపోయాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా వ్యక్తిగత ఇమేజ్ కోసం పరుగులు చేస్తావ్? అంటూ నిలదీస్తున్నారు.

తుక్‌తుక్ అకాడమీకి స్వాగతం..

టోర్నీల్లో విజయాలు సాధించాలన్నా.. టైటిల్ గెలవాలన్న గౌతమ్ గంభీర్ వంటి దూకుడు కలిగిన వ్యక్తులు జట్టులో ఉండాలి తప్పా వ్యక్తిగత ఇమేజ్ కోసం పరుగులు చేసే కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు కాదని కామెంట్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ తుక్ తుక్ అకాడమీలోకి ఎంట్రీ అయ్యాడని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ ఆటను చూసి గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడని, అతన్ని కిందపడేసి తంతాడనే వీడియో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు

గెలిపించిన హర్షల్ పటేల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79), దీపక్ హుడా(26 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 19వ ఓవర్‌లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి హజెల్ వుడ్ మ్యాచ్ మూమెంటమ్ మార్చేసాడు.

Story first published: Thursday, May 26, 2022, 8:29 [IST]
Other articles published on May 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+