ఇదేం అవుట్ రా బాబూ.. వికెట్‌ను తానే కొట్టుకున్న టీమిండియా స్టార్!
న్యూజిలాండ్-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఘోర బ్యాటింగ్ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కనీసం ఖాతా తెరిచే అవకాశం లేకుండా డకౌట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అత్యంత విచిత్రమైన రీతి హిట్ వికెట్‌గా ఔటయ్యాడు.
బ్యాలెన్స్ కోల్పోయి బ్యాట్‌తో స్టంప్స్ ను తాకి..
రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 15 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్ మాత్రమే చేయగలిగాడు. కివీస్ బౌలర్ ఫ్రేజర్ షీట్ వేసిన బంతిని ఆపే క్రమంలో కేఎల్ రాహుల్ డిఫెన్స్ ఆడగా.. బంతి బ్యాట్ అంచుకు తగిలి వికెట్ల వైపు దొర్లుకుంటూ వెళ్లింది. బంతి స్టంప్స్‌కు తగిలితే బౌల్డ్ అవుతాననే కంగారులో దానిని నిలువరించేందుకు కేఎల్ రాహుల్ తన బ్యాట్‌ను వెనక్కి చాచాడు. దీంతో బెయిల్స్ కిందపడి హిట్ వికెట్‌గా నిష్క్రమించక తప్పలేదు. కేఎల్ రాహుల్ ఔటైన ఈ అసాధారణ విధానం సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ ఘోర పతనం
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. జట్టులోని ఐదుగురు బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు తరఫున యశ్ రాథోడ్(44 నాటౌట్), దేవదత్ పడిక్కల్(32) మాత్రమే కొంతవరకు పోరాడగా.. యశస్వి జైస్వాల్(17), అన్షుల్ కంబోజ్(10) పరుగులు సాధించారు.
న్యూజిలాండ్ భారీ ఆధిక్యం.. పడిక్కల్, సాయి సుదర్శన్ పోరాటం
ఇండియా-ఏ నమోదు చేసిన 113 పరుగుల స్వల్ప స్కోరుకు సమాధానంగా న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగుల భారీ స్కోరు సాధించి 204 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏకు మళ్లీ ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌లు తక్కువ వ్యవధిలోనే నిష్క్రమించినప్పటికీ.. దేవదత్ పడిక్కల్(56 నాటౌట్), సాయి సుదర్శన్(39 నాటౌట్) ధైర్యంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి న్యూజిలాండ్ కంటే ఇంకా 98 పరుగుల వెనుకబడి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


