శ్రీలంక ఆటగాడి నెత్తి పగలగొట్టిన కేఎల్ రాహుల్.. ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. శ్రీలంక ఫీల్డర్ నిషాన్ మదుషంక నెత్తి పగలగొట్టాడు. కేఎల్ రాహుల్ ఆడిన స్వీప్ షాట్.. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మదుషంక నెత్తికి బలంగా తాకింది. దాంతో అతను తీవ్ర నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో పరీక్షించి అతన్ని బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. ప్రబాత్ జయసూర్య వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్ మిడిల్ అయిన బంతి షార్ట్ లెగ్‌లో ఉన్న నిషాన్ మదుషంక హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో మదుషంకకు దిమ్మతిరిగిపోయింది.

వెంటనే హెల్మెట్‌ను పక్కనపడేసి నెత్తి పట్టుకొని కనిపించాడు. ఫిజియోలు వచ్చి అతన్ని పరీక్షించారు. ఈ అనూహ్య ఘటనతో కంగారు పడిపోయిన కేఎల్ రాహుల్.. సింగిల్ పూర్తి చేసిన వెంటనే మదుషంక దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. గాయం గురించి ఆరా తీసాడు. రాహుల్ చర్యకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మదుషంకను పరీక్షించిన ఫిజియోలు అతన్ని మైదానం బయటకు తీసుకెళ్లిపోయారు.
పాపం జైస్వాల్..
మరుసటి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. శ్రీలంక అరంగేట్ర స్పిన్నర్ కేశర నువంత తప్పిదానికి యశస్వి జైస్వాల్ బలయ్యాడు. నాన్‌స్ట్రైకర్‌గా సింగిల్‌కు పరుగెత్తిన జైస్వాల్‌కు అడ్డుగా బంతిని అందుకోవడానికి కేశర డైవ్ చేయగా.. అతన్ని తాకి బ్యాలెన్స్ కోల్పోయిన జైస్వాల్ కిందపడిపోయాడు.
అప్పటికే కేఎల్ రాహుల్ సగం క్రీజు ధాటగా.. జైస్వాల్‌కు ఏం చేయాలో తెలియకు యూటర్న్ తీసుకున్నాడు. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌కు పరుగెత్తడంతో జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. కేశర నువంతపై రాహుల్‌తో పాటు జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షం అంతరాయం..
యశస్వి జైస్వాల్(32) ఔటైనా.. దేవదత్ పడిక్కల్(38 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(33 బ్యాటింగ్) సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. దాంతో టీమిండియా 27 ఓవర్లలో 101/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. తొలి సెషన్ అనంతరం వర్షం రావడంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాదాపు గంటన్నర సమయం వృథా అయ్యింది. ఆ తర్వాత ఎట్టకేలకు రెండో సెషన్ ప్రారంభం కాగా.. భారత్ నిలకడగా ఆడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

