LSG VS KKR: పాపం కేఎల్ రాహుల్.. డికాక్ తప్పిదంతో డైమండ్ డక్!

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌటైన రాహుల్.. డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సహచర ఓపెనర్ క్వింటన్ డికాక్ తప్పిదం కారణంగా రాహుల్ ఔటయ్యాడు. ఈ సీజన్‌లో రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగడం ఇది మూడోసారి. ప్రస్తుతం రాహుల్ డైమండ్ డక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాహుల్ పట్ల అభిమానులు సానుభూతి చూపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు టీమ్ సౌథీ వేసిన తొలి ఓవర్‌లోనే చుక్కెదురైంది. క్రీజులో ఉన్న డికాక్ ఆ ఓవర్ ఐదో బంతిని కవర్స్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. డికాక్ పిలుపుతో కేఎల్ రాహుల్ వేగంగా పరుగెత్తుకు రాగా.. ఫీల్డర్ బంతిని అందుకోవడాన్ని గమనించిన డికాక్ యూటర్న్ తీసుకున్నాడు. దాంతో రాహుల్ తిరిగి క్రీజ్ చేరుకునే ప్రయత్నంలో రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ బుల్లెట్ త్రోకు లక్నో కెప్టెన్ ఔటయ్యాడు.

రాహుల్ డకౌట్‌తో ఫ్యాన్స్‌కు టెన్షన్...
ప్రస్తుత సీజన్‌లో కేఎల్ రాహుల్ డకౌట్ కావడం ఇది మూడోసారి. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ రాహుల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ గోల్డెన్ డక్(తొలి బంతికే) అయ్యాడు. రాహుల్ ఇలా ఔటైన గత రెండు మ్యాచ్‌ల్లో లక్నో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి తప్పదేమోనని ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్షమాపణలు చెప్పిన డికాక్..
ఇక తన వల్లే కేఎల్ రాహుల్ ఔటయ్యాడని భావించిన డికాక్.. కేఎల్ రాహుల్‌కు క్షమాపణలు తెలియజేశాడు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లో రాహుల్ మైదానంలోకి రాగా.. అతనికి దగ్గరకు వెళ్లిన డికాక్.. తన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. దానికి రాహుల్ సైతం హుందాగా స్పందించాడు. ఆటలో ఇలాంటి వన్నీ సహజమేనన్నాడు. తొలి ఓవర్‌లోనే రాహుల్ వికెట్ కోల్పోయినప్పటికీ లక్నో ఏమాత్రం తగ్గకుండా కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. డికాక్ ధాటిగా ఆడటంతో ఆ జట్టు పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications