Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: కేఎల్ రాహుల్

KL Rahul feels his team could have been on losing side against KKR

ముంబై: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో విజయం సాధించామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ విజయంతో లక్నో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. కేకేఆర్ ఇంటిదారి పట్టింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం స్పందించిన కేఎల్ రాహుల్ ఇలాంటి మ్యాచ్‌లు ఈ సీజన్‌లో మిస్సయ్యామన్నాడు. ఈ తరహా మ్యాచ్‌ల నేపథ్యంలో తనకు ఎక్కువ మొత్తం చెల్లించాలని నవ్వుతూ చెప్పాడు.

'ఈ తరహా మ్యాచ్‌ల కోసం నాకు మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో ఇలాంటి మ్యాచ్‌లను మిస్సయ్యాం. ఇలా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లు చాలా తక్కువ. కొన్ని చివరి ఓవర్‌ వరకు వెళ్లిండొచ్చు. అయితే, ఈ మ్యాచ్‌లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కచ్చితంగా మేం ఓడిపోయే మ్యాచ్‌లాగే అనిపించింది. అదే జరిగి ఉంటే కచ్చితంగా మేం సరిగ్గా ఆడలేదనే భావనతో వెనుదిరిగేవాళ్లం. ఈ సీజన్‌లో మా చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఘనంగా పూర్తి చేయడం బాగుంది. రెండు జట్ల ఆటగాళ్లు గొప్పగా ఆడినందువల్లే ఇలాంటి మ్యాచ్‌ ఆస్వాదించాం.

మార్కస్‌ స్టోయినిస్ చివరి రెండు బంతులను ప్రణాళికలకు తగ్గట్లు వేసి విజయం అందించడం గొప్ప విశేషం. మేం బ్యాటింగ్‌లో చాలా మెరుగ్గా ఆడాం. అయితే, మాపై కోల్‌కతా ఎదరుదాడి చేస్తుందని తెలుసు. ఇలాంటి విజయాలు ఆటగాళ్లకు మనోధైర్యాన్ని ఇస్తాయి. ఇక డికాక్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే నేను ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాను. అతడు చాలా క్లీన్‌గా బౌండరీలు బాదాడు. ఈ సీజన్‌లో మా ఆటగాళ్లు పలువురు కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

అదే పని మేం ఈ మ్యాచ్‌లో చేశాం. చివర్లో లూయిస్‌ పట్టిన క్యాచ్‌ అమోఘం. అతడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. అయినా, ఈ రోజు అద్భతమైన క్యాచ్‌ అందుకున్నాడు. అతనికి ఈ రోజు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోయినా ఏదో ఒక విధంగా జట్టుకు ఉపయోగపడాలనే తాపత్రయం కనిపించింది. మొహ్‌సిన్‌ ఖాన్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. త్వరలోనే అతడు టీమిండియా తరఫున ఆడతాడనుకుంటున్నా'అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 19, 2022, 17:17 [IST]
Other articles published on May 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+