Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: పాపం.. అల్లాడిపోయాడయ్యా బిడ్డా!

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అల్లాడిపోయాడు. వెస్టిండీస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి కేఎల్ రాహుల్‌కు తాకరాని చోట తాకింది. దాంతో రాహుల్ మైదానంలోనే కుప్పకూలి నొప్పితో విలవిలలాడాడు. యోగాసనాలు వేస్తూ సతమతమయ్యాడు. రాహుల్ పరిస్థితిని చూసి టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ఫిజియో‌ను కూడా పట్టించుకునే స్థితిలో రాహుల్ లేడు. ఎట్టకేలకు ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటనతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంటకు 140 ప్లస్ కిలోమీటర్ల వేగంతో జైడన్ సీల్స్ బంతులు సంధించగా రాహుల్.. డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఓవర్ తొలి బంతిని ఆపిన రాహుల్.. రెండో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ తరలించాడు. కానీ మూడో బంతిని సీల్స్ లెంగ్త్‌లో వేయగా.. రాహుల్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి నేరుగా రాహుల్ పురుషాంగం భాగంలో బలంగా తాకింది. దాంతో రాహుల్ నొప్పితో అల్లాడిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. 'సామాన్లు జాగ్రత్త.. రాహుల్'అని సెటైర్లు పేల్చుతున్నారు.

KL Rahul Escapes Injury After Ball Strikes His Abdominal Guard During Delhi Test
Photo Credit: Screengrab from JioHotstar

టెస్ట్‌లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. 121 పరుగుల లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. విజయానికి మరో 58 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్(25 బ్యాటింగ్)‌తో పాటు సాయి సుదర్శన్(30 బ్యాటింగ్) ఉన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో వారికన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్(8) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

పోరాడిన విండీస్..

అంతకుముందు 173/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్‌బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) సెంచరీలతో చెలరేగగా.. జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

జైడెన్స్ సీల్స్(32)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ ఆఖరి వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/44), కుల్దీప్ యాదవ్(3/104) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 13, 2025, 17:35 [IST]
Other articles published on Oct 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+