For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. 11 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా రాహుల్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ నిరాశపర్చగా.. కేఎల్ రాహుల్( 92 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 112 నాటౌట్) అజేయ శతకంతో భారత జట్టును ఆదుకున్నాడు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రాహుల్ ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 73 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డితో ఆరో వికెట్‌కు 57 రన్స్, సిరాజ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 28 పరుగులు జోడించాడు. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రాహుల్.. మరో 30 (82) బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.

KL Rahul Creates History With Highest Individual Score Ever at Niranjan Shah Stadium

96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. రాహుల్‌కు ఇది 8వ వన్డే సెంచరీ. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోర్ కూడా రాహుల్‌దే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్ అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు.

రాజ్‌కోట్‌లో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్లు

కేఎల్ రాహుల్(భారత్) vs న్యూజిలాండ్ 112* 2026

క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) vs భారత్ 108 2015

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) vs భారత్ 98 2020

శిఖర్ ధావన్ (భారత్) vs ఆస్ట్రేలియా 96 2020

మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) vs భారత్ 96 2023

Story first published: Wednesday, January 14, 2026, 18:31 [IST]
Other articles published on Jan 14, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+