Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన ఫీట్‌తో ఆ జాబితాలో రాహుల్.. 100 వికెట్ల క్లబ్‌లో మణికట్టు మాంత్రికుడు

KL Rahul Becomes Third Fastest Indian to Score 1000 ODI Runs

రాజ్‌కోట్‌: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కమ్ వికెట్ కీపర్‌గా అవతారమెత్తిన టీమిండియా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 80 పరుగులతో రాణించి మ్యాన్ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్న రాహుల్‌.. వన్డే ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన నాలుగో ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

రాహుల్‌ 27 మ్యాచ్‌ల్లోనే

రాహుల్‌ 27 మ్యాచ్‌ల్లోనే

రాహుల్‌ 27 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ సాధించగా.. కోహ్లి, ధావన్‌ 24 మ్యాచ్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తిచేసి తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (25 మ్యాచ్‌ల్లో) రాహుల్ కన్నా ముందున్నాడు.

కుల్దీప్ సెంచరీ..

కుల్దీప్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లోనే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అరుదైన రికార్డు నమోదు చేశాడు. భారత్‌ తరఫున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా ఈ చైనామన్ బౌలర్ గుర్తింపు పొందాడు. తన 58వ మ్యాచ్‌లో కుల్దీప్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక అంతకు ముందు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 76 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ ఘనతనందుకున్న మూడో బౌలర్ కుల్దీప్. మహ్మద్ షమీ(56), బుమ్రా(57).. ఈ మణికట్టు స్పిన్నర్ కంటే ముందు తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టారు.

అద్భుత విజయం

అద్భుత విజయం

ఇక ఆస్ట్రేలియాపై వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్‌కు ఇది 25వసారి. ఈ మ్యాచ్‌లో ఇండియా 36 పరుగులతో గెలిచి మూడో వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. టీమిండియా విధించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్‌ విఫలమైంది. పర్యాటక జట్టు బ్యాట్సమెన్లలో స్టీవ్‌ స్మిత్(102 బంతుల్లో 98 పరుగులు)‌, లబుషేన్‌( 47 బంతుల్లో 46 పరుగులు)తో కొంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. శిఖర్‌ ధావన్‌(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించి భారత్‌కు భారీ స్కోరు అందించారు.

Story first published: Saturday, January 18, 2020, 11:12 [IST]
Other articles published on Jan 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+