Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!

KL Rahul-Athiya Shetty gets wedding gifts worth crores from Virat Kohli and MS Dhoni

ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తన చిరకాల ప్రేయసి, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత సోమవారం(జనవరి 23)న మహారాష్ట్రలో అతియా తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి చెందిన అత్యంత విలావసవంతమైన ఖండాల ఫామ్ హౌస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

అటు సునీల్ శెట్టికి అత్యంత సన్నిహితంగా ఉండే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో పాటు రాహుల్ సహచర ఆటగాళ్లు అయిన వరుణ్ ఆరోన్, ఉమేశ్ యాదవ్‌లు పెళ్లికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు దూరంగా పెళ్లి చేసుకున్న రాహుల్-అతియాలు సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకున్నారు.

లైట్ పింక్ కలర్ దుస్తుల్లో..

లైట్ పింక్ కలర్ దుస్తుల్లో..

లైట్ పింక్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో ఈ ఇద్దరూ తళక్కుమన్నారు. ఈ ఫొటోలకు ఈ జోడీ తమదైన శైలిలో ఓ క్యాప్షన్ ఇచ్చింది. 'నీ వెలుగులో.. ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు. మాకెంతో ఇష్టమైన సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.'అని రాసుకొచ్చారు.

ఈ నూతన వధూవరులకు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ అనంతరం సినీ, రాజకీయా, క్రీడా ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని రాహుల్-అతియా భావిస్తున్నారు.

 ఖరీదైన బహుమతులు..

ఖరీదైన బహుమతులు..

రాహుల్-అతియా పెళ్లికి హాజరు కాకపోయినా.. టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు భారీ బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు క్రికెటర్లతో పాటు కుటుంబ సన్నిహితులు, సినీ ప్రముఖులు ఖరీదైన బహుమతులు అందజేశారని, ఇండియా టీవీ, టీవీ 9 భారత్ వర్ష్ చానెల్స్ పేర్కొన్నాయి.

మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఎంతో ఇష్టమైన కవాసకి నింజా బైక్‌ను రాహుల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.80 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక విరాట్ కోహ్లీ రూ.2.17 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కట్నం కింద ముంబైలోని రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను సునీల్ శెట్టి ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాహుల్ పెళ్లికి వచ్చిన ఖరీదైన బహుమతులు..

రాహుల్ పెళ్లికి వచ్చిన ఖరీదైన బహుమతులు..

సునీల్ శెట్టి- ముంబైలో రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్

విరాట్ కోహ్లీ- రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు

మహేంద్ర సింగ్ ధోనీ-రూ. 80 లక్షలు విలువైన కవాసకి నింజా బైక్

జాకీ ష్రాఫ్-రూ.30 లక్షల విలువైన వాచ్

సల్మాన్ ఖాన్- రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారు

అర్జున్ కపూర్- రూ.1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్‌లెట్

 2019 నుంచి..

2019 నుంచి..

కేఎల్ రాహుల్, అతియా శెట్టి గత మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. 2019లో మొదలైన వీరి స్నేహం.. ప్రేమగా చిగురించి వివాహ బంధానికి దారి తీసింది. ఆరంభంలో ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన ఈ జంట.. ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. రాహుల్‌తో కలిసి అతియా టీమిండియా పర్యటనలకు కూడా వెళ్లింది. ఐపీఎల్ సమయంలోనూ అతనితోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరి పోస్ట్‌లకు మరొకరు కామెంట్ చేయడంతో వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం అందరికి తెలిసింది.

Story first published: Wednesday, January 25, 2023, 19:24 [IST]
Other articles published on Jan 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+