For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: టీమిండియాను ఆదుకున్న గిల్, రాహుల్!

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్‌‌గా వెనుదిరిగారు. క్రిస్ వోక్స్ తన తొలి ఓవర్‌లోనే ఈ ఇద్దర్నీ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్‌మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) జట్టును ఆదుకున్నారు.

మూడో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే చివరి రోజు రెండున్నర సెషన్లు బ్యాటింగ్ చేయాలి. లేదంటే ఈ మ్యాచ్ ఇంగ్లండ్ వశమవుతోంది. ముఖ్యంగా తొలి సెషన్‌ను భారత్ ఆచితూచి ఆడాలి. టీమిండియా ఆటగాళ్లు క్లాస్ బ్యాటింగ్‌తో డ్రా కోసం మాత్రమే ప్రయత్నించాలి.

KL Rahul and Shubman Gill Lead India s Resilient Fightback End Day 4 on 174 2 in 4th Test vs England

అంతకుముందు 544/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141) సెంచరీతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/134) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/112), వాషింగ్టన్ సుందర్(2/107) రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసారు.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)

భారత్ రెండో ఇన్నింగ్స్: 174/2 (కేఎల్ రాహుల్ 82 బ్యాటింగ్, శుభ్‌మన్ గిల్ 78 బ్యాటింగ్, క్రిస్ వోక్స్ 2/48)

Story first published: Saturday, July 26, 2025, 23:20 [IST]
Other articles published on Jul 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+