Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టి పెళ్లి ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

KL Rahul and Athiya Shetty To Tie The Knot In Next 3 Months

ముంబై: టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలో ఇంటివాడు కానున్నాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నటి అతియా శెట్టితో పీకల్లోతు ప్రేమలో ఉన్న రాహుల్.. మరో మూడు నెలల్లో పెళ్లి పీఠలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి ముహుర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్‌ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టిని కలిసారని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ఇరు కటుంబాలు పర్యవేక్షిస్తున్నాయని అతియా సన్నిహితులు మీడియాకు తెలిపారు.

ఇక పెళ్లి అనంతరం రాహుల్-అతియా ఉండబోయే ఇంటిని కూడా ఇరు కుటుంబాలు సందర్శించాయని పేర్కొన్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇక సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు చివరి నిమిషంలో గాయంతో దూరమైన కేఎల్ రాహుల్ ప్రస్తుతం భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్‌ చికిత్స కోసం జర్మనీలో ఉండగా.. ప్రేయసి అతియా కూడా అతనితోనే ఉంది. రాహుల్‌ గాయం నుంచి కోలుకునేందుకు మరో నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా కూడా రాహుల్‌తోనే ఉంటుందని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

అతియా సోదరుడు అహాన్ శెట్టి అరంగేట్ర సినిమా 'తడప్' ప్రీమియర్ సందర్భంగా రాహుల్-అతియాలు తొలిసారి తమ ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ప్రకటించారు. టీమిండియా తదుపరి కెప్టెన్‌ రేసులో ఉన్న రాహుల్‌.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు సునీల్‌ శెట్టి గారాలపట్టి అతియా బాలీవుడ్‌ సినిమాల్లో బిజీగా ఉంది.

Story first published: Tuesday, July 12, 2022, 13:50 [IST]
Other articles published on Jul 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+