Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్!

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్‌తో పాటు అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వచ్చే ఏడాది తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతియా శెట్టి గర్భవతి అనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

'మాకు త్వరలోనే అందమైన పాపాయి పుట్టబోతుంది '2025 అనే క్యాప్షన్ తోపాటు పక్కనే చిన్ని చిన్న పాదాలున్న ఎమోజీని పంచుకున్నారు. ఈ కామెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రాహుల్-అతియా ఫోటోను జత చేశారు.

బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టిని కేఎల్ రాహుల్ గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంటకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, క్రికెట్, రాజకీయ వర్గాలతో పాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2019 నుంచి ప్రేమించుకుంటున్న ఈ జోడీ.. గతేడాది పెద్దల సమక్ష్యంలో ఒక్కటయ్యారు. అయితే వారి ప్రేమ వ్యవహారాన్ని చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ఉంచారు. కానీ ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫాలో అవ్వడం, కామెంట్ చేసుకోవడం, పార్టీలకు హాజరవ్వడంతో వీరి ప్రేమయాణాన్ని నెటిజన్లు పసిగట్టారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలను ఎక్కించింది.

ప్రస్తుతం కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు దూరమైన రాహుల్.. టెస్ట్‌ల్లో కూడా తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో అతన్ని అందరి కన్నా ముందు అక్కడికి పంపించగా.. భారత్ ఏ తరఫున విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్‌లో 4, 10 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.

ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ అతను ఔటైన విధానం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వైఫల్యంతో రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది. రాహుల్ స్థానంలో యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు బ్యాటర్‌గా అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

KL Rahul and Athiya Shetty announce pregnancy expecting their first child in 2025
Story first published: Friday, November 8, 2024, 19:45 [IST]
Other articles published on Nov 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+