For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KL Rahul 2.O:మూడేళ్ల తర్వాత వచ్చి.. సచిన్, కోహ్లీకి సాధ్యం కానీ ఘనతను అందుకున్నాడు!

KL Rahul 2.0: How did Karnataka Batsman turn his Test batting around
KL Rahul 2.0 కన్నడ డైనమైట్‌.. Lord’s బోర్డులో సువర్ణక్షరాలతో, వాళ్ళకే సాధ్యంకాలేదు | Oneindia Telugu

లండన్: 2018లో సెంచరీ కొట్టినప్పుడు కేఎల్ రాహుల్.. టెస్ట్‌ల్లో పర్మినెంట్ ప్లేయర్ అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సంప్రదాయక ఫార్మాట్ ఆడటానికి అతనికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్య కాలంలో టీమిండియా చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. కానీ రాహుల్‌కు ప్లేస్ మాత్రం దొరకలేదు. కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడం. ఎక్కువగా వైట్ బాల్ మ్యాచ్‌లపై దృష్టిపెట్టడంతో టెస్ట్‌లకు దూరయ్యాడు.

అయితే శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయాల బారిన పడటంతో.. వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని రాహుల్ అందిపుచ్చుకున్నాడు. భారత్ నుంచి తొమ్మిది మంది మాత్రమే సెంచరీ చేసిన క్రికెట్ మక్కా.. లార్డ్స్ హానరరీ బోర్డు మీద తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో రాహుల్ 2.Oగా తలపిస్తున్నాడు.

రాహుల్‌ది కీలక పాత్ర..

రాహుల్‌ది కీలక పాత్ర..

రెండో టెస్ట్‌లో భారత్ గెలవడంతో అందరూ బౌలర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ బ్యాటింగ్‌లో అంతకుమించిన పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కూడా ఈ ప్రశంసలకు అర్హుడే. ఎందుకంటే మూడేళ్ల కిందట టెస్ట్‌ల్లో అతను కీలక ప్లేయర్. కానీ ఈ సిరీస్‌కు ముందు ప్లేస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆటగాడు. ఎందుకంటే శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వంటి ఆటగాళ్ల నుంచి విపరీతమైన పోటీ ఉండటంతో ఓ దశలో ఆడే చాన్స్ దక్కుతుందని ఎవరూ ఊహించలేదు.

కానీ గిల్, మయాంక్ గాయాల బారిన పడటం, పృథ్వీ లేట్‌గా రావడంతో రాహుల్‌కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ గతంతో పోలిస్తే బ్యాటింగ్‌లో చాలా రాటుదేలాడు. దాని ఫలితమే లార్ట్స్‌లో సెంచరీ.

సూపర్ టెక్నిక్..

సూపర్ టెక్నిక్..

ఒకప్పుడు రాహుల్ షాట్స్ కొట్టడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. దీనివల్ల త్వరగా ఔటయ్యేవాడు. దీంతో టెస్ట్‌లకు పనికిరాడనే ముద్ర కూడా పడింది. కానీ ఇప్పుడు అతని లక్ష్యం మారింది. తనదైన డిఫెన్స్‌తో పాటు, క్రమశిక్షణ కలిగిన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 'గతంలో నేను పరుగుల గురించే ఎక్కువగా ఆలోచించా.

దానివల్ల ఎక్కువ షాట్స్ కొట్టేవాడ్ని. ఆ క్రమంలో త్వరగా ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగేది. కానీ ఇప్పుడు నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా. బౌలర్లు మంచి మైండ్‌సెట్‌తో గుడ్ స్పెల్స్ వేస్తే నేను నా టెక్నిక్, డిఫెన్స్‌ను నమ్ముకుంటున్నా. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. నా దృష్టంతా నాకు ఇచ్చిన బాధ్యతపైనే. వ్యక్తిగత గోల్స్‌ను పక్కన బెట్టేశా. దీనివల్ల ఆటపై ఏకాగ్రత పెరిగింది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

తెలివిగా బ్యాటింగ్ చేస్తూ..

తెలివిగా బ్యాటింగ్ చేస్తూ..

అండర్సన్ బౌలింగ్‌లో ఎక్కువ బాల్స్‌ను వదిలేస్తున్న రాహుల్.. బాడీకి క్లోజ్‌గా వచ్చే బంతులను డెడ్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాడు. స్ట్రయిక్ రేట్ పట్టించుకోకుండా బంతిని ఎదుర్కొనేందుకు అవసరమైన స్ట్రయిక్ పాయింట్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో రాహుల్ 360 డిగ్రీ ప్లేయర్. ఓపెనర్‌గా మిడిల్, డెత్ ఓవర్లలోనూ బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.

అయితే లార్డ్స్ వచ్చేసరికి అతను పూర్తి భిన్నంగా ఆడాడు. ఈ స్కిల్స్‌ను అలాగే కొనసాగిస్తే .. రెగ్యులర్ ఓపెనర్లు వచ్చినా అతని ప్లేస్‌కు డోకా ఉండకపోవచ్చు. ఇక రాహుల్‌ జోరుతో తాజా సిరీస్‌లో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా బెంచ్‌కే పరిమితం కానున్నారు.

10వ బ్యాట్స్‌మన్‌గా..

10వ బ్యాట్స్‌మన్‌గా..

వాస్తవానికి ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ ఓపెనరే కాదు.. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 129 రన్స్ చేసిన రాహుల్.. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగులు... కోహ్లీతో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చాక బ్యాటు ఝులిపించిన ఈ కన్నడ డైనమైట్‌.. తన కెరీర్‌లో ఆరో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేయడం ద్వారా వినూ మన్కడ్‌, గుండప్ప విశ్వనాథ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, రవిశాస్త్రి, మహమ్మద్‌ అజారుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ, అగర్కార్‌, రాహుల్‌ ద్రవిడ్‌, రహానే తర్వాత పదో భారత క్రికెటర్‌గా రాహుల్‌.. ఆనర్స్‌ బోర్డులో పేరు దక్కించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, కోహ్లీకే ఈ ఘనత సాధ్యంకాలేదు.

19 స్థానాలు ఎగబాకి..

19 స్థానాలు ఎగబాకి..

ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో రాహుల్ టెస్ట్‌ల్లో తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఐసీసీ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 37వ ప్లేస్‌లో నిలిచాడు. గత వారం రాహుల్‌ 56వ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం అతనికి కలిసొచ్చింది. రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌కు బౌలర్ల అసాధారణ ప్రదర్శన కూడా తోడవ్వడంతో లార్డ్స్ టెస్ట్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 391 రన్స్ చేసి 27 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో కోహ్లీసేన 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది. మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది.

Story first published: Thursday, August 19, 2021, 15:14 [IST]
Other articles published on Aug 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+