Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రింకూ సింగ్ బచ్చా కాదు.. కేకేఆర్‌‌కా బాప్: షారూఖ్ ఖాన్

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ సంచలనం రింకూ సింగ్‌పై ఆ జట్టు కో ఓనర్, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రింకూ సింగ్ బచ్చా కాదని, కేకేఆర్‌కా బాప్ అని కితాబిచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా షారూఖ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన షారూక్ ఖాన్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చాడు. ఈ నేపథ్యంలో
'కేకేఆర్‌ కా బచ్చా రింకూ సింగ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి' అని ఓ అభిమాని షారూక్‌ను ప్రశ్నించాడు. దానికి 'రింకూ సింగ్ బచ్చా కాదు.. కేకేఆర్‌కా బాప్‌' అని షారూక్‌ ఖాన్‌ అదిరిపోయే సమాధానమిచ్చాడు.

Shah Rukh Khan says Rinku singh is Baap,

ఐపీఎల్ 2023 సీజన్‌లో రింకూ సింగ్ 14 మ్యాచ్‌లు ఆడి 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఆఖరి 5 బంతులకు 5 సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో స్టార్ ఆటగాడిగా మారిపోయాడు.

తీవ్రమైన ఒత్తిడిలోనూ రింకూ సింగ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ను చూసి దిగ్గజ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు. ఇదే జోరు కొనసాగిస్తే అతడిని త్వరలో టీమ్‌ఇండియాకు ఎంపిక కావడం ఖాయమని పలువురు మాజీలు విశ్లేషించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రింకూ సింగ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న టీమిండియా.. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటన‌కు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. త్వరలోనే టీ20 టీమ్‌ను ఎంపిక చేయనుంది.

Story first published: Monday, June 26, 2023, 20:22 [IST]
Other articles published on Jun 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+