న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rinku Singh: మళ్లీ డీఆర్‌ఎస్ లొల్లి.. రూల్స్ మరిచి అంపైర్లతో కేకేఆర్ బ్యాటర్ వాగ్వాదం! (వీడియో)

Rinku Singh argues with on-field umpires

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో మళ్లీ డీఆర్‌ఎస్ వ్యవహారంపై దుమారం రేగింది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డీఆర్‌ఎస్ రూల్స్‌పై అవగాహన లేక బ్యాటర్ చేసిన తప్పిదం వివాదానికి దారితీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రింకూ సింగ్ డీఆర్‌ఎస్ కోరడం మరిచిపోయాడు. నాన్ స్ట్రైకర్ బ్యాటర్ కోరాడు కదా? అని టైమ్ అయిపోయేదాక అలసత్వం ప్రదర్శించి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత తానే కరెక్ట్ అంటూ అంపైర్లతోనూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్లు నిబంధనలు వివరించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని నట్టూ ఇన్ స్వింగ్ యార్కర్‌గా సంధించగా.. రింకూ సింగ్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో బంతి అతని ప్యాడ్లను తాకడంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ అనంతపద్మనాభన్ ఔటివ్వగా.. రింకూ నాన్‌స్ట్రైకర్ సామ్ బిల్లింగ్స్‌తో రివ్యూ కోసం చర్చించాడు. అయితే బిల్లింగ్స్ రివ్యూ కోరగా.. రింకూ నిలబడిపోయాడు. డీఆర్‌ఎస్ టైమర్ 15 సెకన్లు పూర్తవ్వడంతో ఫీల్డ్ అంపైర్ రింకూ సింగ్‌ను మైదానం వీడాలని చెప్పాడు.

దాంతో ఆగ్రహానికి గురైన రింకూ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. చివరకు రూల్స్ వివరించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే రూల్స్ ప్రకారం ఔటైన బ్యాటర్ సమీక్ష కోసం టీ బార్ సిగ్నల్ ఇవ్వాలి. కానీ బిల్లింగ్స్ ఇచ్చాడు కదా అని రింకూ అలసత్వం ప్రదర్శించడంతో అంపైర్లు మెడపట్టి గెంటేసే పరిస్థితి వచ్చింది. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సైతం ఫోర్త్ అంపైర్‌తో ఈ వ్యవహారంపై మాట్లాడాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించగా... అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్‌లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) ధాటిగా ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Saturday, May 14, 2022, 22:34 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X