For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs SRH: అందుకే బ్యాటింగ్ తీసుకున్నా: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో జరుగుతున్న కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఇది హైస్కోరింగ్ గేమ్ అనుకుంటున్నాం. ఈ సీజన్‌లో మా బ్యాటింగ్ విభాగం సంచలన ప్రదర్శనలు కనబర్చింది. అదే జోరును ఈ రోజు కూడా కొనసాగిస్తారని భావిస్తున్నా. మేం ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తున్నాం.'అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

KKR vs SRH Pat Cummins reveals the reason why Sunrisers same eleven as the last game

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్‌ చేయాలనుకున్నాం. పిచ్ క్యూరేటర్‌తో మాట్లాడినప్పుడు ఇది మిక్స్‌డ్ సాయిల్ అని చెప్పాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. మా మూమెంటమ్‌ను కొనసాగించడం చాలా ముఖ్యం.

గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టడం కీలకం. టేబుల్ టాపర్‌గా నిలవడం గొప్ప ఘనత. జట్టులోని ప్రతీ ఒక్కరు గర్వపడుతున్నారు. మేం ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, షెహ్‌బాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టీ నటరాజన్

కేకేఆర్:
రెహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, వైభవ్ అరోరా

Story first published: Tuesday, May 21, 2024, 19:21 [IST]
Other articles published on May 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+