ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 160 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. మిచెల్ స్టార్క్(3/34) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది.
రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(3) వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది.
నిప్పులు చెరిగిన మిచెల్ స్టార్క్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అతను వేసిన తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్(0) క్లీన్ బౌల్డ్ కాగా.. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(9) సైతం స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో హెన్రీచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు.

ఆదుకున్న త్రిపాఠి..
ఈ క్రమంలో 29 బంతుల్లో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. హెన్రీచ్ క్లాసెన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అబ్దుల్ సమద్(16)తో సమన్వయ లోపంతో రాహుల్ త్రిపాఠి రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా సన్వీర్ సింగ్(0)ను పంపించగా.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే అబ్దుల్ సమద్(16)ను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. భువనేశ్వర్ కుమార్(0)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చగా.. ప్యాట్ కమిన్స్(30) ఒంటరి పోరాటం చేశాడు. విజయ్‌కాంత్ వియాస్కంత్(7 నాటౌట్) సాయంతో జట్టుకు 160 పరుగుల పోరాడే లక్యాన్ని అందించాడు.