Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH క్వాలిఫయర్ మ్యాచ్.. కోల్‌కతా బ్లండర్ మిస్టేక్! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్లండర్ మిస్టేక్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే రివ్యూ తీసుకోకుండా కేకేఆర్ ఘోర తప్పిదం చేసింది.

బంతి బ్యాట్‌కు తాకిందేమోనని భ్రమపడి రివ్యూ తీసుకోలేదు. స్టార్క్ గట్టిగా అప్పీల్ చేసినా మిగతా ఫీల్డర్లు నమ్మకంగా లేకపోవడంతో రివ్యూ తీసుకోకుండా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెనుకడుగు వేసాడు. కానీ టీవీ రీప్లేలో అది ఔటని తేలింది. బంతి బ్యాట్ తాకకుండా రాహుల్ త్రిపాఠి షూను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ రివ్యూ తీసుకొని ఉండి ఉంటే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దనే రాహుల్ త్రిపాఠి ఔటయ్యేవాడు.

KKR vs SRH Kolkata made a mistake by not taking review for Rahul Tripathi LBW

అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. ఈ అవకాశంతో చెలరేగిన రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెన్రీచ్ క్లాసెన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. రాహుల్ త్రిపాఠి ఔటై ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత కష్టాల్లో పడేది. చివరకు అతను రనౌట్‌గా వెనుదిరిగాడు.

అబ్దుల్ సమద్‌తో సమన్వయ లోపంతో పాటు ఆండ్రీ రస్సెల్ సూపర్ త్రోకు రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 160 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. మిచెల్ స్టార్క్(3/34) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది.

రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(3) వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది.

Story first published: Tuesday, May 21, 2024, 21:13 [IST]
Other articles published on May 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+