For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs SRH: తెలుగు కామెంటేటర్‌గా కాజల్ అగర్వాల్..! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన కాజల్ అగర్వాల్ సందడి చేసింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ బాక్స్‌లోకి ముఖ్య అతిథిగా వచ్చిన కాజల్ అగర్వాల్.. తన వ్యాఖ్యానంతో అదరగొట్టింది.

ఈ సందర్భంగా క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తానని చెప్పిన కాజల్ అగర్వాల్.. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు తన ఫేవరేట్ క్రికెటర్లని చెప్పింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఇష్టమని పేర్కొంది. నితీష్ కుమార్ రెడ్డి గురించి చెబుతుండగానే అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

KKR vs SRH Kajal Aggarwal says Virat Kohli and MS Dhoni are my favourite cricketers

సత్య భామ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సార్ట్ స్పోర్ట్స్ ఛానెల్‌కు వచ్చిన కాజల్ అగర్వాల్.. తన సినిమా ముచ్చట్లు పంచుకోవడంతో పాటు క్రికెట్ వ్యాఖ్యానంతో అభిమానుల మనసులను గెలుచుకుంది. కాజల్ అగర్వాల్‌ కామెంట్రీకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.అతను వేసిన తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్(0) బౌల్డ్ కాగా.. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఓ సిక్సర్‌తో దూకుడు కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డి.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే షెహ్‌బాజ్ అహ్మద్‌ను అప్‌ది ఆర్డర్ బ్యాటింగ్‌కు పంపంగా.. స్కార్క్ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెన్రీచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సత్యభామ. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యువ హీరో నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. అయితే మే 31వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన పాటలు సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

Story first published: Tuesday, May 21, 2024, 20:33 [IST]
Other articles published on May 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+