Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: కళ్లు చెదిరే రనౌట్.. కోపంతో ఊగిపోయిన గంభీర్! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ షెహ్‌బాజ్ అహ్మద్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షెహ్‌బాజ్ స్టన్నింగ్ త్రో ‌తో సునీల్ నరైన్‌ను రనౌట్ చేశాడు. అతను విసిరిన బంతి డైరెక్ట్‌గా వికెట్లను తాకడంతో సునీల్ నరైన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని ఫిలిప్ సాల్ట్.. బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు మూమెంట్ ఇచ్చాడు. నాన్ స్ట్రైకర్‌గా ఉన్న నరైన్ హాఫ్ పిచ్ ధాటగా.. బంతి షెహ్‌బాజ్ చేతిలోకి వెళ్లడం చూసి ఫిలిప్ సాల్ట్ యూటర్న్ తీసుకున్నాడు.

KKR vs SRH IPL 2024 Gautam Gambhir extremely disappointed with the runout dismissal of Sunil Narine

నరైన్ సైతం క్రీజులోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. షెహ్‌బాజ్ డైరెక్ట్ హిట్ చేశాడు. దాంతో అతను బిత్తరపోయాడు. అయితే నరైన్ పూర్తి ఎఫర్ట్ పెట్టినట్లు అనిపించలేదు. అతని ఔటైన తీరుపై కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డగౌట్‌లో గంభీర్ చాలా కోపంగా కనిపించాడు. ఇంత నిర్లక్ష్యమా? అంటూ అసహనంతో కనిపించాడు.

ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌‌గా మారగా.. నెటిజన్లు షెహ్‌బాజ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది.

పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకొని సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగుతున్నారు. సంచలన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టారు. వెంకటేశ్ అయ్యర్(7), శ్రేయస్ అయ్యర్(0)లను నటరాజన్ పెవిలియన్ చేర్చగా.. నితీశ్ రాణా(9) మార్కండే ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన రమణదీప్ సింగ్‌తో ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

Story first published: Saturday, March 23, 2024, 20:48 [IST]
Other articles published on Mar 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+