Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీర విహారం!

కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రూ రస్సెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్) పరుగుల సునామీ సృష్టించాడు. సిక్సర్ల సునామీతో సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోసాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌లో రస్సెల్ విధ్వంసంతో కేకేఆర్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సెల్‌కు తోడుగా ఫిల్ సాల్ట్(40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. మార్కండే రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓదశలో 51/4తో నిలిచిన కేకేఆర్ సాధారణ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ రస్సెల్ విధ్వంసంతో చివరి 37 బంతుల్లో90 పరుగులు చేసింది.

KKR vs SRH IPL 2024 Andre Russell s breathtaking 64 takes KKR to 208

శుభారంభం లేకున్నా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్(2).. షెహ్‌బాజ్ అహ్మద్ కళ్లు చెదిరే త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే నటరాజన్ ఒకే ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్‌(7), శ్రేయస్ అయ్యర్(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 43 పరుగులు చేసింది.

ఆ వెంటనే మయాంక్ మార్కండే..నితీష్ రాణా(9)ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో కేకేఆర్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, రమణదీప్ సింగ్(35) జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. రమణ‌దీప్ సింగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

రస్సెల్ సునామీ..
ఆ మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిల్ సాల్ట్‌ను మార్కండే క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్.. రింకూ సింగ్‌తో కలిసి సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మార్కండే వేసిన 16వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన ఈ విండీస్ వీరుడు.. భువీ బౌలింగ్‌లో 6, 4 కొట్టాడు.

20 బంతుల్లోనే 50
నటరాజన్ వేసిన 18వ ఓవర్‌లో మరో భారీ సిక్సర్ బాదిన రస్సెల్.. భువీ వేసిన 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్సర్ బాది 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరో భారీ సిక్సర్ బాదిన అతను.. మరో ఫోర్‌తో జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. రస్సెల్ ధాటికి భువీ 26 పరుగులు సమర్పించుకున్నాడు.

నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి రింకూ సింగ్(20) క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన స్టార్క్ బౌండరీ బాదాడు. చివరి నాలుగు బంతులను నటరాజన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

Story first published: Saturday, March 23, 2024, 21:28 [IST]
Other articles published on Mar 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+