For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్‌పై దుమారం.. SRH అసహనం!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను డీప్ స్క్వేర్ లెగ్‌లో వరుణ్ చక్రవర్తీ అందుకున్నాడు.

అయితే ఈ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. చివరకు ఔట్‌గా ప్రకటించాడు. కానీ రిప్లేలో కూడా బంతికి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ స్పష్టమైన ఆధారం లేకుండా ఔటివ్వడంతో అభిషేక్ శర్మ తీవ్ర నిరాశతో మైదానం వీడాడు. ఈ నిర్ణయంపై అతను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

KKR vs SRH Controversy Abhishek Sharma Dismissed After Varun Chakravarthy s Stunning Catch Daniel Vettori Fumes at Umpire s Decision

సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి కూడా అసహనంగా కనిపించాడు. ఫోర్త్ అంపైర్‌తో ఈ క్యాచ్ గురించి వాగ్వాదానికి దిగాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన ఆధారం లేనప్పుడు బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మన్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ క్యాచ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వివాదాస్పదమైంది. ముజర్బానీ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ముజర్బానీ ఈ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ(1) తీవ్రంగా నిరాశపర్చగా.. హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడలేకపోయారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులే చేసింది. హెన్రీచ్ క్లాసెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని(4/41) నాలుగు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా(2/47) రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగీ, అంకూల్ రాయ్ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, April 2, 2026, 21:19 [IST]
Other articles published on Apr 2, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+