Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: ఆ తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయి!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరిగిన కీలక క్వాలిఫయర్-1లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్‌తో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

దాంతో హోరాహోరీగా సాగుతుందని భావించిన క్వాలిఫయర్-1 ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నాలుగు తప్పిదాలు కొంపముంచాయి.

Things That Went Wrong For Sunrisers Hyderabad

1. బ్యాటింగ్ ఎంచుకోవడం
అహ్మదాబాద్ పిచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ సరిగ్గా రీడ్ చేయలేదు. రెడ్, బ్లాక్ మిక్స్‌డ్ సాయిల్‌తో ఈ పిచ్ సిద్దం చేయడంతో ఆరంభంలో బౌలింగ్‌‌కు సహకరించిన ఈ వికెట్.. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ బ్యాటింగ్‌కు ఈజీగా మారింది. డ్యూ కూడా రావడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమైంది.

ఇలాంటి వికెట్‌పై టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. తమ బలమైన బ్యాటింగ్ లైనప్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కమిన్స్ తెలిపాడు. కానీ అతని ప్లాన్ మిస్ ఫైర్ అయ్యింది. బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ తీసుకొని ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా జరిగి ఉండేది.

2. ఓపెనర్ల వైఫల్యం
పిచ్ కండిషన్స్‌ తగ్గట్లు ఆడకుండా తమదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(0)లు మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఇద్దరి వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని కష్టాల్లోకి నెట్టింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఓపెనర్లదే ప్రధాన పాత్ర. ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే అసాధారణ విజయాలు అందించారు.

ఇద్దరిలో కనీసం ఒక్కరైనా సత్తా చాటారు. కానీ కీలక మ్యాచ్‌లో ఇద్దరూ చేతులెత్తేయడం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. ఈ ఇద్దరి ఒక్కరు క్రీజులో నిలబడినా ఫలితం మరోలా ఉండేది.

3. రనౌట్.. డకౌట్స్..
టీ20 క్రికెట్‌లో వరుస బంతుల్లో వికెట్లు కోల్పోవడం ఏ మాత్రం శ్రేయాస్కారం కాదు. కానీ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు వరుసగా వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి వికెట్ అనంతరం షెహ్‌బాజ్ అహ్మద్‌ను అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ పంపించగా అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

ఈ నిర్ణయం జట్టుకు తీరని నష్టం చేసింది. షెహ్‌బాజ్‌కు బదులు క్లాసెన్‌నే పంపించి ఉండాల్సింది. అప్పుడు షెహ్‌బాజ్ అహ్మద్ లోయరార్డర్‌లో రాణించేవాడు. రాహుల్ త్రిపాఠి రనౌట్ అయితే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన అతను లేని పరుగుకు పరుగెత్తి మూల్యం చెల్లించుకున్నాడు.

ఆ వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సన్వీర్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి రనౌటవ్వుకుండా చివరి వరకు పోరాడినా.. సన్వీర్ సింగ్ ఇంపాక్ట్ చూపించినా సన్‌రైజర్స్ కాస్త మెరుగైన స్కోర్ చేసేది.

4. సరైన స్పిన్నర్‌ను తీసుకోకపోవడం..
అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని తెలిసి కూడా స్పెషలిస్ట్ ఇండియన్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడం సన్‌రైజర్స్ ఓటమిని ఖాయం చేసింది. ఏ మాత్రం ప్రభావం చూపని విజయకాంత్ వియాస్కంత్‌ను కొనసాగించడం.. స్పెషలిస్ట్ స్నిన్నర్లు అయిన వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే‌లను పరిగణలోకి తీసుకోకపోవడం.. గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్‌లను పట్టించుకోకపోవడం కూడా నష్టం చేసింది.

క్వాలిఫయర్‌-2కు అయిన మంచి వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంది. చెన్నైలోని చెపాక్ మైదానం కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకు తగ్గట్లు టీమ్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం కీలకం.

Story first published: Wednesday, May 22, 2024, 0:32 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+