ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌తో 109) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది.
సునీల్ నరైన్‌కు తోడుగా రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30) రాణించాడు. చివర్లో రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఆవేశ్ ఖాన్ సంచలన క్యాచ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్(10).. ఆవేశ్ ఖాన్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన రఘువంశీ(30)తో కలిసి సునీల్ నరైన్ ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన సునీల్ నరైన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న రఘు వంశీ(30)ని కుల్దీప్ సేన్ ఔట్ చేసాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయస్ అయ్యర్(11), ఆండ్రీ రస్సెల్(11) విఫలమైనా... సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

శతక్కొట్టిన నరైన్
భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని దూకుడుకు ట్రెంట్ బౌల్ట్ బ్రేక్ వేసాడు. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌తో రింకూ సింగ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కుల్దీప్ సేన్ వేసిన ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ కొట్టిన సిక్సర్‌ను బౌండరీ లైన్ వద్ద రియాన్ పరాగ్ అద్భుతంగా అడ్డుకున్నాడు.
దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారింది. ఆ మరుసటి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెంకటేశ్ అయ్యర్(8) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి రమణదీప్(1) రాగా.. రింకూ సింగ్ సిక్సర్ బాది జట్టుకు 223 పరుగుల భారీ స్కోర్ అందించాడు.