KKR vs RR: చెలరేగిన రాణా, రింకూ సింగ్.. 5 పరాజయాల తర్వాత కోల్‌కతా విజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు తెరదించింది. వరుసగా 5 ఓటముల తర్వాత నాలుగో విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. సంజూ శాంసన్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రియాన్ పరాగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19), హెట్‌మైర్(13 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివం మావి, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

చెలరేగిన రింకూ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్), రింకూ సింగ్ (23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, కుల్దీప్ సేన్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేకున్నా..
153 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే మరో ఓపెనర్ బాబా ఇంద్రజిత్(15) కూడా ఔటవ్వడంతో కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. అయితే క్రీజులో సెట్ అయిన ఈ జోడీని బౌల్ట్ విడదీసారు. షార్ట్ బాల్‌తో అయ్యార్ బోల్తా కొట్టించాడు.

సిక్సర్‌తో ముగింపు..
అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో పాటు వైడ్ కూడా ఇవ్వడంతో రివ్యూకు వెళ్లిన సంజూ ఫలితాన్ని రాబట్టారు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ భారీ సిక్సర్‌తో తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత కూడా అతను అదే జోరు కనబర్చగా.. మరోవైపు నితీశ్ రాణా కూడా ధాటిగా ఆడాడు. చివరి ఓవర్‌లో విజయానికి 6 బంతుల్లో 1 పరుగు అవసరం కాగా.. నితీశ్ రాణా సిక్సర్‌తో ముగించాడు. దాంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications