Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RR: అందుకే తుది జట్టులో మార్పులు చేశాం: సంజూ శాంసన్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈడెన్ గార్డెన్స్ మైదానం ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

ఈ మైదానంలో మళ్లీ ఆడుతున్నందుకు ఉత్సాహంగా ఉంది. ఈ స్టేడియంలో ఏదో శక్తి ఉంటుంది. తుది జట్టు రెండు మార్పులు చేశాం. గత మ్యాచ్‌కు దూరమైన జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్ తిరిగి వచ్చారు.'అని సంజూ శాంసన్ తెలిపాడు.

KKR vs RR Rajasthan Royals win toss opt to bowl first

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ గత మ్యాచ్ మాదిరే ఉండనుంది. బంతి స్వింగ్ అవ్వనుంది. నరైన్‌కు ఎలాంటి పిచ్‌తోనైనా సంబంధం లేదు. అతను తనదైన శైలిలో చెలరేగుతాడు. అతను తనకు నచ్చిన విధానంలో చెలరేగాలని కోరుకుంటున్నాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

కేకేఆర్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంఘిక్రిష్ రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పోవెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్: జోస్ బట్లర్

Story first published: Tuesday, April 16, 2024, 19:20 [IST]
Other articles published on Apr 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+