Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RR: కేకేఆర్‌దే బ్యాటింగ్.. రాజస్థాన్‌లో భారీ మార్పులు!

Rajasthan bowl, Morris and Livingstone back against Kolkata

షార్జా: ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ వికెట్‌ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుందని, అందుకే ఫీల్డింగ్ తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపాడు. లివింగ్ స్టోన్, ఉనాద్కత్, రావత్, మోరీస్ జట్టులోకి రాగా.. లూయిస్, శ్రేయస్ గోపాల్, మిల్లర్ ఉద్వాసనకు గురయ్యారని చెప్పాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, సౌథీ స్థానంలో ఫెర్గూసన్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కోల్‌కతా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉండగా.. రాజస్తాన్ రాయల్స్ విజయంపై ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాదించింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని శాంసన్ సేన భావిస్తోంది.

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్‌: సంజూ శాంసన్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్‌, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, అనూజ్ రావత్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహ్మాన్

Story first published: Thursday, October 7, 2021, 19:29 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+