రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లను జోస్ బట్లర్ అధిగమించాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శతకం చేయడం ద్వారా జోస్ బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో జోస్ బట్లర్‌కు ఇది ఏడో శతకం కాగా.. చేజింగ్‌లో మూడో సెంచరీ. చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ(2), బెన్ స్టోక్స్(2) ఉన్నారు.

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. ఏడు శతకాలతో అతను కోహ్లీ(8) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్(6)ను బట్లర్ అధిగమించాడు. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ నాలుగేసి శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్ పవర్ ప్లేలో 12 బంతుల్లో 20 పరుగులు చేసిన బట్లర్.. మిడిలార్డర్‌లో 21 బంతుల్లో 22 పరుగులే చేశాడు. డెత్ ఓవర్లలో 27 బంతుల్లో 65 పరుగులు చేసి శతకంతో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేకేఆర్‌పై జోస్ బట్లర్‌కు ఇది రెండో సెంచరీ. ఒకే జట్టుపై ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ రెండో స్థానంలో నిలిచాడు. కేకేఆర్, ఆర్‌సీబీలపై బట్లర్ రెండేసి శతకాలు నమోదు చేశాడు.
ముంబై ఇండియన్స్‌పై 3సెంచరీలతో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. బట్లర్ విధ్వంసకర శతకంతో కేకేఆర్‌పై రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌తో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30), రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) రాణించారు
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్ ఒంటరి పోరాటానికి రియాన్ పరాగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), రోవ్‌మన్ పోవెల్(13 బంతుల్లో 26) సహకారం అందించారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో రెండు వికెట్లు తీసారు. వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.