KKR vs RR: ఏం అంపైరింగ్‌రా అయ్యా.. క్యాచ్ అయితే వైడ్ ఇస్తారు! మీకో దండం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్ల ఘోర తప్పిదాలు పునరావృతమవుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ అంపైర్లు బ్లండర్ మిస్టెక్స్ చేశారు. క్లీన్ క్యాచ్ ఔట్‌ను వైడ్‌గా ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతకుముందు వైడ్ విషయంలోనూ ఇలాంటి తప్పిదమే చేశారు. దాంతో అంపైర్ల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ఏం అంపైరింగ్‌రా అయ్యా.. మీకో దండం అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..?
కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా ట్రెంట్ బౌల్ట్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బౌల్ట్ వేసిన షాట్ బాల్‌ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన అతను సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి అయ్యర్ గ్లోవ్స్‌ను ముద్దాడుతూ సంజూ శాంసన్ చేతిలో పడింది. ఔట్ అంటూ గట్టిగా అప్పీల్ చేసిన సంజూకు ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇస్తూ షాకిచ్చాడు. దాంతో నిర్ఘాంతపోయిన అతను వెంటనే రివ్యూ తీసుకొని ఫలితం సాధించాడు. క్యాచ్ ఔట్ అయితే వైడ్ ఇవ్వడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైడ్ అయితే ఇవ్వలేదు..
ఇదెక్కడి చెత్త అంపైరింగ్ అంటూ మండిపడుతున్నారు. రాజస్థాన్ బ్యాటింగ్ సందర్భంగా శివం మావి వేసిన ఆఖరి ఓవర్‌లోనూ క్లియర్ వైడ్‌ను అంపైర్ ఇవ్వలేదు. దీనిపై నాన్‌స్ట్రైకర్‌గా అశ్విన్ అంపైర్‌ను నిలదీసాడు. వైడ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. బ్యాటింగ్ చేస్తున్న హెట్‌మైర్ సైతం అసహనానికి గురయ్యాడు. ఇది కూడా క్లియర్ వైడ్ అని, కానీ అంపైర్ నిద్రపోయాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
కోల్‌కతాదే విజయం..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. సంజూ శాంసన్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రియాన్ పరాగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19), హెట్‌మైర్(13 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివం మావి, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్), రింకూ సింగ్ (23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, కుల్దీప్ సేన్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications