Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RR Dream11 Prediction: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! పిచ్ రిపోర్ట్, తుది జట్లు ఇవే!!

KKR vs RR Dream11 Prediction: Captain, Vice-Captain Tips And Playing XI For Match 54

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా గురువారం (సెప్టెంబర్ 7) డబుల్ హెడర్ మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఇక రెండో మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు పోటీపడనున్నాయి. ఐపీఎల్ 2021లోని 54వ మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. కోల్‌కతా, రాజస్థాన్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్ రాత్రి 7 గంటలకు పడనుంది.

ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఐపీఎల్ 2021 సీజన్‌లో జరుగుతోన్న 54వ మ్యాచ్‌ కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్​ రాయల్స్​ జట్ల మధ్య షార్జా మైదానంలో జరగనుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా కోల్‌కతా, రాజస్థాన్ జట్లు 23 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 12 సార్లు గెలుపొందగా.. రాజస్థాన్ 11 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో కోల్‌కతా, రాజస్థాన్ తలపడిన మ్యాచులో మోర్గాన్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో మూడు కోల్‌కతా​, రెండు రాజస్థాన్ గెలిచింది.

షార్జా వికెట్‌ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. షార్జా మైదానం చిన్నది కాబట్టి భారీ స్కోర్ నమోదు అవకాశం ఉన్నా.. ఇటీవల మాత్రం 160-170 పరుగులే నమోదవుతున్నాయి.

కోల్‌కతా మెరుగైన అవకాశాలు

కోల్‌కతా మెరుగైన అవకాశాలు

ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్‌లో మిగిలిన నాలుగో స్థానం సాధించే అవకాశం ఎక్కువగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకే ఉంది. అందులోనూ కోల్‌కతా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై, కోల్‌కతా ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించాయి. కేకేఆర్‌కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటం కలిసొచ్చే అంశం.

తమ ఆఖరి మ్యాచుల్లో రాజస్థాన్‌తో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌తో ముంబై తలపడతాయి. రాజస్థాన్‌ మీద కేకేఆర్‌ గెలిచి.. సన్‌రైజర్స్‌ మీద ముంబై ఓడిపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండానే కోల్‌కతాకు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. అందుకే ఈ రోజు మ్యాచ్ గెలిచేందుకే కోల్‌కతా ప్రయత్నింస్తోంది.

IPL 2021:'పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నా..ఏదో ఒకరోజు నా కొడుకు టీమిండియాకు ఆడతాడు'

 రాజస్థాన్‌ గెలిస్తే

రాజస్థాన్‌ గెలిస్తే

మరోవైపు రాజస్థాన్‌ చేతిలో కేకేఆర్‌, సన్‌రైజర్స్‌పై ముంబై ఓటమిపాలైతే.. పంజాబ్‌ కూడా రేసులోకి వస్తుంది. పంజాబ్‌ తన చివరి మ్యాచ్‌లో చెన్నై మీద భారీ విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్‌ నాలుగో స్థానం ఎంట్రీ కాస్త సంక్లిష్టమవుతుంది. కేకేఆర్‌ (12 పాయింట్లు), ముంబై (12), రాజస్థాన్‌ (12), పంజాబ్‌ (12) సమానంగా ఉంటాయి. ఈ సమయంలో నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో ఈమ్యాచ్ రాజస్థాన్ జట్టుకు కెలకమనే చెప్పాలి. ఇరు జట్లు ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నాయి. స్టార్ అటగాళ్లు ఉన్న నేపథ్యంలో గెలిచే అవకాశాలు రెండు జట్లకు ఉన్నాయి.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్) శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మయాంక్ మార్ఖండే / శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రహమాన్.

డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్, సంజు శాంసన్ (వైస్ కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా.

Story first published: Thursday, October 7, 2021, 16:23 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+