Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RR: చెలరేగిన శుభ్‌మన్ గిల్, అయ్యర్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం!

KKR vs RR: Aggressive Kolkata post 171 on sluggish Sharjah

షార్జా: బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై ఓపెనర్లు శుభమన్ గిల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), వెకంటేశ్ అయ్యర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్, వెకంటేశ్ అయ్యర్ రాణించగా.. రాహుల్ త్రిపాఠి(14 బంతుల్లో 21) విలువైన పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా తలో వికెట్ తీశారు.

ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభమన్ గిల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), వెకంటేశ్ అయ్యర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) శుభారంభం అందించారు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఆరంభంలో కొంచెం నిదానంగా ఆడటంతో కేకేఆర్ పవర్ ప్లేలో 34 పరుగులే చేసింది. అనంతరం జోరు పెంచిన ఈ జోడీ.. భారీ షాట్లు ఆడింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రాహుల్ తెవాటియా విడదీసాడు. వెంకటేశ్ అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అయ్యర్.. బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వస్తూ వస్తూనే భారీ సిక్సర్ బాది జోరు కనబర్చిన నితీశ్ రాణా(12).. అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి శుభ్‌మన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చేతన్ సకారియా వేసిన 15వ ఓవర్‌లో ఐదో బంతిని బౌండరీకి తరలించిన శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే క్రిస్ మోరీస్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి దినేశ్ కార్తీక్ రాగా.. రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సకారియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌.. దినేశ్ కార్తీక్‌తో కలిసి తనదైన షాట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Story first published: Thursday, October 7, 2021, 21:33 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+