For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఆర్‌సీబీ శుభారంభం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా దుమ్మురేపితో బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ రఫ్ఫాడించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), అంగ్‌క్రిష్ రఘువంశీ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా(3/29) మూడు వికెట్లు తీయగా..జోష్ హజెల్ వుడ్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, యశ్ దయాల్ తలో వికెట్ తీసారు. రహానే- నరైన్ ధాటికి ఓ దశలో కేకేఆర్ 220 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృనాల్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో కేకేఆర్‌ను సాధారణ స్కోర్‌కే కట్టడి చేశాడు.

KKR vs RCB Virat Kohli stars as RCB chase down 175 in just 16 2 overs in Kolkata

విధ్వంసకర బ్యాటింగ్..
అనంతరం ఆర్‌సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ రజత్ పటీదార్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34 ) దూకుడుగా ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
175 పరుగుల లక్ష్య చేధనలో ఆర్‌సీబీ అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. కోహ్లీ కూడా అతనితో పోటీ పడి బౌండరీలు బాదాడు. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ స్పిన్నర్లను బరిలోకి దించగా.. ఈ జోడీ అదే జోరు కనబర్చింది. ఈ క్రమంలో ఫిల్ సాల్ట్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ధాటిగా ఆడే క్రమంలో వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ క్యాచ్ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ విధ్వంసం..
క్రీజులోకి దేవదత్ పడిక్కల్ రాగా.. . ఆర్‌సీబీ 9.5 ఓవర్లలో 100 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే పడిక్కల్(10) ఔటవ్వగా.. బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటీదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ షాట్లతో వేగంగా పరుగులు చేశాడు. విజయం ముంగిట అతను ఔటవ్వగా.. లివింగ్ స్టోన్(15 నాటౌట్) తనదైన షాట్లతో విజయ లాంఛానాన్ని పూర్తి చేశాడు.

Story first published: Saturday, March 22, 2025, 22:53 [IST]
Other articles published on Mar 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+