Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో నాలుగు జట్లపై 1000 ప్లస్ రన్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

ఈ క్రమంలోనే కేకేఆర్‌పై 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్‌తో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కూడా వెయ్యికి పైగా పరుగులు చేశాడు. కోహ్లీ మినహా మరే ఆటగాడు ఐపీఎల్‌లో ఈ ఫీట్ సాధించలేదు. డేవిడ్ వార్నర్.. పంజాబ్ కింగ్స్, కేకేఆర్‌లపై మాత్రమే 1000 ప్లస్ రన్స్ చేయగా.. రోహిత్ శర్మ(కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్), శిఖర్ ధావన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై మాత్రమే 1000 ప్లస్ రన్స్ చేశాడు.

KKR vs RCB Virat Kohli becomes the first batter in IPL history to achieve unique record

కోహ్లీ@400
ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ 448 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. దినేశ్ కార్తీక్ 412 మ్యాచ్‌లతో కోహ్లీ కంటే ముందున్నాడు.

98 హాఫ్ సెంచరీలు..
400 టీ20ల్లో విరాట్ కోహ్లీ 98 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో 9శతకాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లోనే అతను 38.95 సగటుతో 8063 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలతో పాటు 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

శుభారంభం..
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44) దూకుడుగా ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా(3/29), జోష్ హజెల్ వుడ్(2/22) కేకేఆర్ పతనాన్ని శాసించారు.

అనంతరం ఆర్‌సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. రహానే- నరైన్ ధాటికి ఓ దశలో కేకేఆర్ 220 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృనాల్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Saturday, March 22, 2025, 23:45 [IST]
Other articles published on Mar 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+