Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB:ప్చ్.. ఆర్‌సీబీ ఘోర పరాజయం! కేకేఆర్‌ను గెలిపించిన శార్దూల్, వరుణ్!

కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ఘోర పరాజయం ఎదురైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో శార్దూల్ ఠాకూర్ దుమ్మురేపితే.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ సత్తా చాటాడు. కోల్‌కతా స్పిన్‌కు ఆర్‌సీబీ బ్యాటర్లు విలవిలలాడారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68), రెహ్మానుల్లా గుర్బాజ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్‌(33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

KKR vs RCB

ఆర్‌సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 3 ఫోర్లతో 21), ఫాఫ్ డుప్లెసిస్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ నాలుగు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు.

భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీకీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ మంచి ఆరంభాన్ని అందించారు. కానీ పవర్‌ప్లేలోనే బంతిని అందుకున్న సునీల్ నరైన్ సూపర్ డెలివరీతో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ కూడా విజృంభించడంతో ఆర్‌సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

వరుణ్ చక్రవర్తీ వేసిన మరుసటి ఓవర్‌లో డుప్లెసిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లేన్ మ్యాక్స్‌వెల్(5), హర్షల్ పటేల్‌లను వరుణ్ చక్రవర్తీ ఓకే ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. షెహ్‌బాజ్ అహ్మద్(1) సునీల్ నరైన్ క్యాచ్ ఔట్ చేయడంతో ఆర్‌సీబీ 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 7 పరుగుల వ్యవధిలోనే ఈ ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం.

ఈ పరిస్థితుల్లో మైఖేల్ బ్రేస్‌వెల్(19) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. శార్దూల్ ఠాకూర్ దెబ్బకొట్టాడు. షార్ట్ పిచ్ బాల్‌తో అతన్ని క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ.. దినేశ్ కార్తీక్(9), ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్(1)‌లను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు.

తన మూడో ఓవర్‌లో కర్ణ్ శర్మ(1)ను కూడా సుయాష్ శర్మ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఏ లెవెల్ క్రికెట్ ఆడని సుయాష్ శర్మ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ మ్యాచ్‌తో‌నే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. చివర్లో ఆకాశ్ దీప్(17) భారీ షాట్లతో విరుచుకుపడిన వరుణ్ చక్రవర్తీ అతన్ని ఔట్ చేసి కేకేఆర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Thursday, April 6, 2023, 23:23 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+