కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ స్కిడ్డీగా ఉండే అవకాశం ఉందని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
గత మ్యాచ్ విజయంతో జట్టులో ఉత్సాహం నెలకొందని, ఇది పూర్తిగా భిన్నమైన మ్యాచ్ అని చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో జట్టులో ఓ మార్పు చేయాల్సి వచ్చిందన్న ఫాఫ్.. గాయపడ్డ టాప్లీ స్థానంలో డేవిడ్ విల్లే జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా తెలిపాడు. డ్యూ ప్రభావం చూపనున్న నేపథ్యంలో చేజింగ్ ఈజీ అవుతుందని చెప్పాడు. జట్టులో ఒకే ఒక మార్పు చేశామని చెప్పిన నితీశ్ రాణా.. అనుకుల్ రాయ్ స్థానంలో సుయాశ్ శర్మ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ జోరు మీద ఉండగా.. పంజాబ్ చేతిలో ఓటమిపాలైన కేకేఆర్ బోణీ కొట్టాలనే తపనతో బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆర్‌సీబీ కలిసొచ్చే అంశం కాగా.. కేకేఆర్ బలహీనంగా కనిపిస్తోంది.
తుది జట్లు:
కేకేఆర్: మన్‌దీప్ సింగ్, రెహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ.
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), షెహ్‌బాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్