కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్ చెత్త రికార్డు నమోదు చేశాడు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్‌గా అప్రతిష్టను మూటగట్లుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
డేవిడ్ విల్లే వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతికి మన్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విల్లే వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని మన్‌దీప్ సింగ్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా.. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ వికెట్‌ను లేపేసింది. ఐపీఎల్‌లో మన్‌దీప్ సింగ్‌కు ఇది 15వ డకౌట్. ఈ క్రమంలోనే అతను రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లను అధిగమించాడు. రోహిత్, దినేశ్ కార్తీక్‌లు ఇప్పటి వరకు 14 సార్లు డకౌటయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు డేవిడ్ విల్లే కోలుకోలేని దెబ్బతీసాడు. వరుస బంతుల్లో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(3), మన్‌దీప్ సింగ్(0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో రెహ్మానుల్లా బౌండరీలు బాదడంతో కేకేఆర్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 47 పరుగులు చేసింది.
ఆ వెంటనే మైఖేల్ బ్రేస్‌వెల్.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా(1)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో రెహ్మానుల్లా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న అతను కర్ణ్ శర్మ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే డేంజరస్ ఆండ్రీ రస్సెల్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.
ఎదుర్కొన్న తొలి బంతికి రస్సెల్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి శార్దూల్ ఠాకూర్ రాగా.. రింకూ సింగ్ పోరాడుతున్నాడు.