For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: కన్నీటి పర్యంతమైన కర్ణ్ శర్మ! (వీడియో)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్‌సీబీ) స్టార్ స్పిన్నర్ కర్ణ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీని గెలిపించలేదనే బాధతో కర్ణ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడు భారీ సిక్స్‌లు బాది ఆశలు రేకెత్తించిన కర్ణ్ శర్మ.. 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన సమయంలో రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో లాకీ ఫెర్గూసన్ రనౌటవ్వడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.

KKR vs RCB Karn Sharma an Emotional after Kolkata win thriller against Bengaluru by 1 run in IPL 2024

ఎలాంటి అంచనాలు లేని సమయంలో సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిన కర్ణ్ శర్మ.. విజయలాంఛనాన్ని పూర్తి చేయలేకపోయాడు. దాంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడినా.. కర్ణ్ శర్మ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్‌దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/56), కామెరూన్ గ్రీన్(2/35) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/40), లాకీ ఫెర్గూసన్(1/47) తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), రజత్ పటీదార్(23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 3 ఫోర్లతో 24), కర్ణ్ శర్మ(7 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు.

Story first published: Sunday, April 21, 2024, 22:34 [IST]
Other articles published on Apr 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+