Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB: అందుకే భువనేశ్వర్ కుమార్ ఆడటం లేదు: రజత్ పటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌తో జరుగుతున్న ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి కఠినంగా కనిపిస్తోంది. ఆర్‌సీబీకి నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప అవకాశం. గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకునేందుకు నాకు ఇదో మంచి ఛాన్స్. గత 10-15 రోజులుగా ఈ సీజన్ కోసం మేం బాగా సన్నదమయ్యాం. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఈ మ్యాచ్‌లో మేం ముగ్గురు బౌలర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. 'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.

KKR vs RCB IPL 2025 Rajat Patidar reveals why Bhuvneshwar Kumar not playing in opening match

కేకేఆర్‌కు కెప్టెన్సీ వహించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని అజింక్యా రహానే తెలిపాడు. 'ఈ సీజన్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. మా కోర్ టీమ్ అలానే ఉంది. ఈ మ్యాచ్‌లో ముందుగా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి.. ఆ తర్వాత డిఫెండ్ చేసుకుంటాం. జట్టులో ప్రతీ ఆటగాడికి పూర్తి స్వేచ్చ ఉంది. మేం ముగ్గురు పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని రహానే చెప్పుకొచ్చాడు.

స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటం ఆర్‌సీబీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న గాయంతో భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని ఆర్‌సీబీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అతి త్వరలోనే అతను జట్టులోకి వస్తాడని పేర్కొంది. అతని స్థానంలో యువ పేసర్ రసిఖ్ దాల్ సలామ్ అవకాశాన్ని అందుకున్నాడు.

తుది జట్లు(అంచనా)

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(కీపర్), రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్

కేకేఆర్: క్వింటన్ డి కాక్(కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

Story first published: Saturday, March 22, 2025, 19:34 [IST]
Other articles published on Mar 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+