Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB: కామెరూన్ గ్రీన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. ఎగిరి గంతేసిన కోహ్లీ!(వీడియో)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు కేకేఆర్ యువ బ్యాటర్ రఘువంశీ(3) నిరాశగా పెవిలియన్ చేరాడు.

యశ్‌దయాల్ వేసిన 6వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతికి రఘువంశీ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. మిస్ టైమ్ అయిన బాల్ ఓవర్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్నకామెరూన్ గ్రీన్ వెనక్కి పరుగెత్తి సింగిల్ హ్యాండ్‌తో అద్బుతంగా అందుకున్నాడు. గ్రీన్ కాకుండా మరే ఫీల్డర్ ఉన్న క్యాచ్ చేజార్చడంతో పాటు బౌండరీ ఇచ్చేవారు.

KKR vs RCB Cameron Green Takes Sensational One Handed Catch To Dismiss Angkrish Raghuvanshi in IPL 2024

అతని హైట్ క్యాచ్‌ పట్టుకునేందుకు సహకరించింది. గ్రీన్ సూపర్ క్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఎగిరి గంతేసాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), సునీల్ నరైన్(10) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించిన అనంతరం యశ్ దయాల్ ఒకే ఓవర్‌లో సునీల్ నరైన్(10)తో పాటు రఘువంశీ(3)ని పెవిలియన్ చేర్చాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన వెంకటేశ్ అయ్యర్(16)ను గ్రీన్ ఔట్ చేశాడు. దాంతో కేకేఆర్ 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్‌తో పాటు రింకూ సింగ్ ఉన్నాడు.

Story first published: Sunday, April 21, 2024, 16:44 [IST]
Other articles published on Apr 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+