For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: కొంపముంచిన యశ్‌ దయాల్, సిరాజ్..!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్యాటర్లు దుమ్మురేపారు. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది.

శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్‌దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/56), కామెరూన్ గ్రీన్(2/35) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/40), లాకీ ఫెర్గూసన్(1/47) తలో వికెట్ తీసారు. మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసిన ఆర్‌సీబీ.. డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమైంది.

KKR vs RCB Andre Russell Ramandeep Singh end things on high RCB need 223 to win

విఫలమైన యశ్ దయాల్, సిరాజ్..
ముఖ్యంగా యశ్ దయాల్, సిరాజ్ పేలవ ప్రదర్శన ఆర్‌సీబీకి నష్టం చేసింది. 17వ ఓవర్‌లో యశ్‌దయాల్ 22 పరుగులు ఇచ్చి మూమెంటమ్‌ను మార్చేసాడు. మరుసటి ఓవర్‌లో గ్రీన్ 9 పరుగులే ఇచ్చినా.. సిరాజ్ 20 పరుగులు ఇచ్చుకున్నాడు.

చివరి ఓవర్‌లో యశ్ దయాల్ 16 పరుగులు ఇవ్వడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. యశ్ దయాల్, సిరాజ్ కట్టడిగా బౌలింగ్ చేసుంటే కేకేఆర్.. 200లోపే పరిమితమయ్యేది.

అదిరిపోయే ఆరంభం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), సునీల్ నరైన్(10) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించిన అనంతరం యశ్ దయాల్ ఒకే ఓవర్‌లో సునీల్ నరైన్(10)తో పాటు రఘువంశీ(3)ని పెవిలియన్ చేర్చాడు.

ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన వెంకటేశ్ అయ్యర్(16)ను గ్రీన్ ఔట్ చేశాడు. దాంతో కేకేఆర్ 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రింకూ సింగ్(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24)‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు.

KKR vs RCB Andre Russell Ramandeep Singh end things on high RCB need 223 to win

అయ్యర్ హాఫ్ సెంచరీ..
ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించిన అనంతరం రింకూ సింగ్‌ను ఫెర్గూసన్ ఔట్ చేశాడు. రస్సెల్‌తో కలిసి అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గ్రీన్ బౌలింగ్‌లో అతను ఔటైనా.. రమణ్‌దీప్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

Story first published: Sunday, April 21, 2024, 17:48 [IST]
Other articles published on Apr 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+