Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB: విరాట్ కోహ్లీ నాటౌట్.. చెత్త అంపైరింగ్: అంబటి రాయుడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చెత్త అంపైరింగ్‌కు బలయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతుంది. కోహ్లీ సైతం అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. డగౌట్‌లోనూ ఆగ్రహంగా కనిపించాడు.

హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ బంతి అతని ఛాతి కంటే ఎత్తులో ఫుల్‌టాస్‌గా రాగా.. విరాట్ కోహ్లీ డిఫెండ్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. హర్షిత్ రాణా అందుకున్నాడు. అంపైర్లు ఔట్ ఇవ్వగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు.

KKR vs RCB Ambati Rayudu says Poor umpiring on Virat Kohli dismissal in IPL 2024 Match vs Kolkata

అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా అతను క్రీజు బయట ఉన్నాడని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అసహనంతో వారిపై నోరు పారేసుకున్నాడు. ఇక ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ అంబటి రాయుడు అంపైర్ల తీరును తప్పుబట్టాడు. ఇది ముమ్మాటికి నాటౌట్‌ అని, అత్యంత చెత్త నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

KKR vs RCB Ambati Rayudu says Poor umpiring on Virat Kohli dismissal in IPL 2024 Match vs Kolkata

'ఇది చాలా పెద్ద నిర్ణయం. విరాట్ కోహ్లీ బిగ్ వికెట్. అంపైర్లు ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకునే ముందు కళ్లు మూసుకుంటారా? అత్యంత చెత్త అంపైరింగ్'అని రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు సైతం అది క్లియర్ నోబాల్ అని అభిప్రాయపడ్డాడు. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అంపైర్ల తీరుపై తప్పుబడుతున్నారు. ఈ సీజన్‌లో అంపైర్ల తీరు చాలా నాసిరకంగా ఉందని మండిపడుతున్నారు.

Story first published: Sunday, April 21, 2024, 19:24 [IST]
Other articles published on Apr 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+