Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది.

వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

KKR vs PBKS Sunil Narine and Phil Salt Helps KKR Post 261 6

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ ఇద్దరూ.. కేకేఆర్ బోర్డును పరుగెత్తించారు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది.

అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. స్కోర్ బోర్డును వేగంగా పరుగెత్తించింది. ఇక సునీల్ నరైన్ 23 బంతుల్లో అర్థం శతకం సాధించగా.. ఫిల్ సాల్ట్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రాహుల్ చాహర్ విడదీసాడు. సునీల్ నరైన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

చెలరేగిన రస్సెల్..
దాంతో తొలి వికెట్‌కు నమోదైన 138 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే ఫిల్ సాల్ట్‌ను సామ్ కరణ్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్ ధాటిగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న రస్సెల్‌(24)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దూకుడుగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో కలిసి వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. అయితే రింకూ సింగ్(5)ను హర్షల్ పటేల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్‌కు దిగిన రమణ్ దీప్ సింగ్ ఓ సిక్సర్ బాదడంతో కేకేఆర్ 261 పరుగులు చేసింది.

Story first published: Friday, April 26, 2024, 21:32 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+