Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS:అందుకే మిచెల్ స్టార్క్‌ను పక్కన పెట్టాం: శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. దురదృష్టవశాత్తు హోమ్ గ్రౌండ్‌లో మేం ఆడిన 4 మ్యాచ్‌‌లకు 4 ఓడాం. ఇక ఇతర మైదానాల్లో జరిగే మ్యాచ్‌లకు మా ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు. టోర్నీలో ముందడుగు వేయాలంటే ఇక్కడి నుంచి ఏం చేయాలో? ఎలా ఆడాలో? మాకు బాగా తెలుసు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో జానీ బెయిర్ స్టో జట్టులోకి వచ్చాడు.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.

KKR vs PBKS Shreyas Iyer Reveals the Reason Why Mitchell Starc Not Playing in IPL 2024 Match vs Punjab

మరోవైపు కేకేఆర్ టీమ్‌లోనూ మార్పులు జరిగాయి. రూ. 24.75 కోట్ల రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్క్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. చేతి వేలి గాయంతో అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'ఈ సీజన్‌లో మేం విభిన్నమైన సమయాల్లో వివిధ ఆటగాళ్లను ఆడించాం. మేం చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి.

ఈ మ్యాచ్‌కు మిచెల్ స్టార్క్ దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో అతని చేతి వేలికి గాయమైంది. అతని స్థానంలో దుష్మంత్ చమీరా జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కడం ముఖ్యం. ఆ ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలిచి.. చివరివరకు ఆ మూమెంటమ్‌ను కొనసాగించాలి.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

తుది జట్లు:

కేకేఆర్:
సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, దుష్మంత్ చమీరా, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, సామ్ కరణ్, రిలీ రోసౌ, జితేశ్ శర్మ, శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్

Story first published: Friday, April 26, 2024, 19:20 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+