కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(47 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. టాపార్డర్, మిడిలార్డ్ విఫలమైనా.. లోయరార్డర్ షారూఖ్ ఖాన్( 8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17) కలిసి జట్టును ఆదుకున్నాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా రెండు, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్(12) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రాజపక్స బ్రాంజ్ డక్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన డేంజరస్ లియామ్ లివింగ్‌స్టోన్(15)ను వరుణ్ చక్రవర్తీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 58 పరుగులు చేసింది.
జితేశ్ శర్మ(21)తో కలిసి ధావన్ జట్టును ముందుకు నడిపించాడు. 53 పరుగులు జోడించిన అనంతరం 6వ వికెట్‌గా జితేశ్ శర్మ వెనుదిరిగాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీ సాధించిన శిఖర్ ధావన్ కూడా ఔటవ్వగా.. రిషి ధావన్(19), షారూఖ్ ఖాన్(21), హర్‌ప్రీత్ బ్రార్ ధాటిగా ఆడి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు.