Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: రింకూ సింగ్ విన్నింగ్ షాట్.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం!

కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్.. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రింకూ సింగ్(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మరోసారి విన్నింగ్ షాట్‌ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్(47 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షారూఖ్ ఖాన్( 8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్‌(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా రెండు, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ తీసారు.

Rinku Singh KKR

అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. నితీశ్ రాణా(38 బంతుల్లో, 6 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రీ రస్సెల్(23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసాడు. దాంతో డేంజరస్ రస్సెల్ రనౌటవ్వగా.. ఆఖరి బంతికి విజయానికి 2 పరుగులు అవసరమవ్వగా.. రింకూ సింగ్ ట్రేడ్ మార్క్‌ షాట్‌తో విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు.

180 పరుగులు లక్ష్యచేధనలో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(15)ను నాథన్ ఎల్లిస్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో రాణా, జాసన్ రాయ్ అద్భుతంగా ఆడారు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో జాసన్ రాయ్ క్యాచ్ ఔటవ్వగా.. వెకంటేశ్ అయ్యర్(11) దారుణంగా విఫలమయ్యాడు.

ఓవైపు వికెట్లు పడినా మరోవైపు నితీశ్ రాణా అద్భుతంగా పోరాడాడు. రాణా ఔటయ్యాక రస్సెల్, రింకూ సింగ్ జట్టును ఆదుకున్నారు. సూపర్ బ్యాంటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

Story first published: Monday, May 8, 2023, 23:39 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+